బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే… ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత కోసం సిద్ధం చేసిన జైలు రూమ్ ఏమైందని ప్రశ్నించారు మా సీట్ల గురించి నువ్వు మాట్లాడతావా.. బండి సంజయ్ నీకు బుద్ధి ఉందా అంటూ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఒకసారి ఆస్పత్రిలో చూపించుకో అని ఆయన అన్నారు. నీ పాదయాత్ర వెనుక కేసీఆర్ లేడా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Data Leak: మీ డేటా లీక్ అయినట్లు అనిపిస్తుందా..? అయితే ఇది మీకోసమే..!
బీజేపీకి ఆ పార్టీలో నీకు హైప్ తేవడానికి నిన్ను అరెస్టులు చేయలేదా అని ఆయన అన్నారు. ఈటల రాజేందర్ ను డౌన్ చేయడానికే.. కేసీఆర్ నిన్ను లేపింది నిజం కాదా అని ఆయన అన్నారు. గంగుల కమలాకర్, నువ్వు ఒక్కటి కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బహిరంగ స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు పొన్నం ప్రభాకర్.
Also Read : MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్