ఖమ్మం జిల్లా కల్లూరు మండలం స్వగ్రామం నారాయణపురం గ్రామంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేరాబూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో భాగంగా స్వగ్రామంలో ఓటర్లను కలిసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమ పేరుతో 9 సంవత్సరాల సుపరిపాలన అందించింది బీజేపీ అని ఆయన అన్నారు. భారతతీయ జనతా పార్టీ దేశానికి సేవా చేయడమే లక్ష్యమన్నారు. దేశం, పార్టీనే భారతీయ జనతా పార్టీ నినాదమన్నారు. కొంత మందిలా కుటుంబ పార్టీ కాదు కుటుంబ పాలన కాదని, గతంలో తమిళనాడు మోడీ వెళ్తే గోబ్యాక్ అన్నారు ఇప్పుడు వాంగా మోడీ వాంగా మోడీ అంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు చెపట్టారు కాబట్టే ఇంతలా అభిమానిస్తున్నారు. ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టే బీఆర్‌ఎస్ టీజర్ రిలీజ్ చేస్తుంది.
Also Read : Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
ఆ ఆ పధకాలు ఇస్తాం అని ఆశ పెడుతున్నారు. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలను బూచి చూపేడుతూ సోషల్ మీడియా ప్రచారంలో చేపిస్తున్నారు. తెలంగాణ లో మునిగిపోయిన నవా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్రాండ్ గా పని చేశాను. కాంగ్రెస్ పార్టీ అంటే నే స్కాంగ్రెస్. ఈ స్కాంగ్రెస్ వాళ్ళు మోడీనా ఢీకొనేది. బెలూను రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంటే బాగుండేది. బెలూను గాలి ఊది ఊది బుడగ పగలిపోతుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీ ప్రభుత్వం రాకుండా మైండ్ గేమ్ అడుతున్నాయి. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే.
Also Read : Singapore: మద్యం మత్తులో సహోద్యోగి చెవిని కొరికినందుకు భారతీయుడికి జైలు శిక్ష
కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు డబ్బులు తీసుకుంటారు… స్వయంగా ఆపార్టీ నాయకులే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశానికి దిక్సూచి నరేంద్ర మోడీనే. ఖమ్మం లో బీజేపీకి ఆదరణ ఎక్కడ ఉన్నది అనే వాళ్ళకు ఓటు వేసే సమయంలో తెలుస్తుంది… బీజేపీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ప్రపంచమే భారతదేశం వైపు చూస్తుంది… కొంతమంది మునిగే నావాలోకి వెళ్ళారు. ఆట మొదలైంది అని కొంత మంది అంటున్నారు యే ఆట మొదలవుతుందో చూద్దాం. ఎక్కడ లేని రాజకీయాలు సత్తుపల్లి,కొత్తగూడెంలో జరుగుతున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ బిఆరె ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. తరుగు పెరుతో దొచుకుంది.’ అని ఆయన అన్నారు.