POCO F7: సింగపూర్ వేదికగా గ్లోబల్ స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్‌లో POCO తన F7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు ఆవిష్కరించింది. F సిరీస్ అనేది POCO ఫ్లాగ్‌షిప్ లైనప్. ఈసారి డిజైన్‌లో, పనితీరులో కొన్ని భారీ గేమ్ ఛేంజింగ్ అప్‌గ్రేడ్ లతో వస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫ్లాగ్‌షిప్‌ల లైనప్‌లో F7 ప్రో, F7 అల్ట్రాలు విడుదలయ్యాయి. ఇందులోని అల్ట్రా వేరియంట్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది మొబైల్ ప్రపంచంలోని అగ్రగామి చిప్స్ లో ఒకటి.
Read Also: IPL 2025: ఈ ఆటగాడి కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..!
ఇక POCO F7 అల్ట్రా విషయానికి వస్తే.. ఇది అల్ట్రా-ఫ్లాగ్‌షిప్ మొబైల్. క్లాసిక్ ఎల్లో, బ్లాక్ రెండు ప్రీమియం రంగుల ఎంపికలలో వస్తుంది. మెరుగైన గ్రాఫికల్ సామర్థ్యాల కోసం POCO మొట్టమొదటి VisionBoost D7 చిప్‌సెట్‌ను ఇందులో పొందు పరిచారు. ఇక ఈ F7 అల్ట్రా శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 50MP వెనుక కెమెరా, LED ఫ్లాష్‌తో అమర్చబడి ఉంటుంది. అలాగే ఇందులో విస్తృతమైన షాట్‌ల కోసం f/2.2 అపర్చర్‌తో 32MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉంది. వీటితోపాటు, 10cm మాక్రో సామర్థ్యంతో 50MP 2.5x ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. దీనితో 20x అల్ట్రాజూమ్‌తో కూడా ఫోటోలను క్లారిటీగా తీస్తుంది. ఈ పరికరం 8K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇందులోని 5300mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ హైపర్ ఛార్జ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 2 స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఇందులోని 12GB+256GB ధర 649 డాలర్స్ (సుమారు రూ. 55,690) కాగా, 16GB+512GB ధర 699 (సుమారు రూ. 59,980)గా నిర్ణయించారు.
Read Also: MH370: పదేళ్ల కిందట విమానం మిస్సింగ్.. ఆచూకీ కోసం ఇప్పుడు సెర్చింగ్..!!
ఇక మరొకవైపు పోకో ఎఫ్7 ప్రో విషయానికి వస్తే.. ఇందులో క్వాల్‌కామ్ సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది. ఇంకా ఇందులోని 6000 mAh బ్యాటరీకి 90W హైపర్‌ఛార్జ్‌తో వస్తుంది. దీనితో కేవలం 37 నిమిషాల్లో మొబైల్ పూర్తి ఛార్జ్ అవుతుంది. ఈ మొబైల్ లో గేమర్స్ కోసం Wildboost ఆప్టిమైజేషన్ 4.0 ని కూడా కలిగి ఉంటుంది. ఇది 2K సూపర్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో IP68 రేటింగ్ వల్ల దుమ్ము, నీటి నిరోధక శక్తిని కలిగి ఉంది. ఇందులో 6.67-అంగుళాల డిస్‌ప్లే, గేమింగ్ కోసం క్రిస్ప్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది. అలాగే ప్రస్తుతం 3,200 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. POCO F7 Pro OIS హార్డ్‌వేర్ స్టెబిలైజేషన్‌తో 50-MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. POCO F7 Pro సిల్వర్, బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇందులో 2GB + 256GB మోడల్ ధర 499 డాలర్స్ (సుమారు రూ. 42,820), 12GB + 512GB మోడల్ ధర USD 549 (సుమారు రూ. 47,110)గా నిర్ణయించారు.