Bhagwant Mann criticized Congress is in a coma: గుజరాత్ ఎన్నికల్లో ఓటమి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిందిస్తూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ పార్టీ భగ్గుమంటోంది. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఆప్ పార్టీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో ఎన్నిసార్లు పర్యటించారు..? ప్రశ్నించారు. కేవలం ఒకేసారి పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో…
Rahul Gandhi blamed AAP for Congress' defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
22 percent of Gujarat MLAs Face Serious Cases: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. వరసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం మంది ఎమ్మెల్యేలలో 151 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. అసెంబ్లీలో 22 శాతం అంటే సుమారుగా 40 మంది…
గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ఇమ్రాన్ ఖేదావాలా 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ముస్లిం అభ్యర్థి.
Ravindra Jadeja's wife Rivaba Jadeja is on the way to huge win: గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ 154 స్థానాల్లో, కాంగ్రెస్ 20, ఆప్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల సంఘం అధికారిక ట్రెండ్స్…
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పార్టీల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.