Pawan Kalyan: గాజు బద్ధలయ్యే కొద్ది ఇంకా పదును ఎక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెందుర్తి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని.. వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు….ఆరు సెటిల్ మెంట్లు అన్నట్టుగా పని చేసిందని ఆయన విమర్శించారు. కాలుష్యం కోరల్లో వున్న తాడి గ్రామం తరలింపుకు భూమి లేదు కానీ అధికారం చెలాయించే వాళ్ళు వేల ఎకరాలు దోచేశారని ఆరోపించారు. జనం రోడ్డెక్కి చొక్కా పట్టుకుని ప్రశ్నించకపోతే పరిస్థితి మారదన్నారు.
Read Also: Kesineni Nani: చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదు..
జగన్‌ను గద్దెదింపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో 23లక్షల మంది యువత గంజాయి మత్తుకు అలవాటు పడ్డారని.. వైజాగ్ పోర్టులో మత్తు మందులు, గంజాయి రవాణా జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో ముంచేద్దామని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ సెటిల్మెంట్‌లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని.. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టినప్పుడు.. మళ్ళీ ఎమ్మెల్యేకు ఎందుకు భయపడాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.