Pawan Kalyan: వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం… బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు. బీసీల నాయకత్వం ఉన్న తెలంగాణ రావాలని పవన్ కోరారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన తెలిపారు.
Read Also: Balakrishna: బాలకృష్ణపై విచిత్ర లైంగిక వేధింపుల ఆరోపణలు.. అందుకే చేశారట!
మరోవైపు.. అన్యాయం జరిగుతే తిరగబడతామని పవన్ కల్యాణ్ అన్నారు. 2004 నుంచి నేమొరీ శంకర్ గౌడ్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి నాతో పోరాటంలో పాల్గొన్నారని అక్కడి ప్రజలనుద్దేశించి తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ రావాలని కోరారు. నాకు జన్మనిచ్చింది ఆంధ్రా అయినా.. పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటానని పవన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే మరణించిన గద్దర్ అన్న మరణం తనను చాలా బాధించిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. శ్రీశైలంలో యురేనియం తవ్వకాలపై ఉద్యమం చేసామని అప్పటి రోజులను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.
Read Also: Jagadeeshwar Goud: నాయకులు ఇచ్చే డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు..
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ నాగర్ కర్నూలు ప్రయాణం రద్దు చేసుకున్నారు. తాండూర్ సభ వేదిక నుంచి పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్ గెలిపించాలని పిలుపునిచ్చారు. తాండూర్ ప్రజలకు సమస్య వస్తే.. ఆ సమస్యపై రోడ్డుపైకి వచ్చి పోరాటం చేద్దామని పవన్ కల్యాణ్ అన్నారు.