Nandamuri Chaitanya krishna Comments on Allegations against Balakrishna: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారమైన విషయం. నిజానికి టాలీవుడ్‌లో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా ఏళ్లుగా ఆరోపణలు వస్తున్నా అవి అటక ఎక్కుతూనే ఉన్నాయి. ఇక తాజాగా స్టార్ హీరో అంటూ ఒకరిపై ఇలాగే తమిళ నటి, ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ విచిత్ర కొన్ని ఆరోపణలు చేశారు. 2000 – 2001 సమయంలో తాను ఒక స్టార్ హీరో సినిమాలో సినిమాలో నటించానని, ఆ హీరో తనను గదికి రమ్మన్నాడని ఆరోపించారు. అయితే ఈ క్రమంలో విచిత్ర ఆ హీరో పేరు కానీ, సినిమా పేరు కానీ చెప్పలేదు కానీ ఎందుకో సోషల్ మీడియా మాత్రం ఆ హీరో నందమూరి బాలకృష్ణ అని తీర్మానించేసి వాట్సాప్ యూనివర్సిటీల్లో, ఫేస్‌బుక్, ట్విట్టర్ లో వీడియోలను వైరల్ చేసి పారేశారు. 2000ల టైంలో తాను ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లాలనని, అక్కడ హీరో తన పేరు కూడా అడక్కుండా నేరుగా రూంకు రమన్నానని తాను వెళ్లకపోవడంతో సెట్‌లో సినిమా యూనిట్ అంతా కలిసి నరకంగా చూపించారని చెప్పుకొచ్చింది విచిత్ర. ఆమె ఆ టైంలో బాలకృష్ణ భలేవాడివి బాసు సినిమా చేసి ఆ తరువాత ఆమె ఇండస్ట్రీకి, సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారని అంతా అనుకున్నారు, కానీ ఈ ఘటన వల్ల దూరమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె ఆ హీరో ఎవరు? ఏ సినిమా? అన్నది క్లారిటీగా చెప్పలేదు.
Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
కానీ తమిళ మీడియా మాత్రం బాలయ్యే అని ప్రచారం చేసింది. బాలయ్య మీదే విచిత్ర ఆరోపణలు చేసిందని జరుగుతున్న క్రమంలో నందమూరి వంశానికి చెందిన కొత్త హీరో చైతన్య కృష్ణ ఆమె చేసిన కామెంట్లను తోసిపుచ్చాడు. విచిత్ర మొన్నీమధ్య బాలకృష్ణ మీద చేసిన కామెంట్లు గురించి మీరేం చెబుతారు అని అడిగితే ఆయన అలా వల్గర్‌గా ప్రవర్తించరు, బాబాయ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు. హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి కదా? అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారు, ఆయనే కాదు ఏ హీరో కూడా అలా ప్రవర్తించరు, ఏదో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే, ఇలా కాదు అలా చేయమని చెబితే ఫీల్ అవుతారు, అలాంటివి ఉంటాయోమే కానీ ఇలా చేయడం అయితే ఉండదని చైతన్య కృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతన్య కృష్ణ అప్పట్లో నటుడిగా జగపతి బాబు సినిమాలో కనిపించాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా ప్రయత్నిస్తున్నాడు. బ్రీత్ అనే చిత్రంతో చైతన్య కృష్ణ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా సొంత నిర్మాణంలో తెరకెక్కగా డిసెంబర్ 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.