వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం... బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు.