Pawan Kalyan Interesting Comments: కాకినాడ ఎంపీ కూడా మనదే.. అందరూ కలిసి పని చేయాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ జనసేన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి.. చలమల శెట్టి సునీల్, వంగా గీత మన ద్వారానే వచ్చారు.. సునీల్ ఇటీవల ఎక్కడో పెళ్లిలో కూడా నాకు కనిపించారు.. సునీల్ మంచి వారే గానీ.. తప్పు పార్టీని ఎంచుకున్నారు.. లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదని భావిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీకి సుస్థిరత ఇవ్వాలని మనసులో లేదు.. అందుకే రాష్ట్రం ఇలా తయారైంది.. నా క్యాడర్ ను నేను రక్షించుకుంటా.. నేను వదలను.. కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్ అని అందరూ అంటారు.. నేడు కాకినాడ గంజాయికి కేంద్రంగా, క్రైం పట్టణంగా మారింది.. వీటిని నిలువరించాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Election effect: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త తేదీలివే!
ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటేనే ఇవి సాధ్యం అవుతాయని జనసేన ఛీప్ తెలిపారు. పదేళ్లు అధికారం లేకుండా పార్టీని నడిపిన వాడిని.. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీలు నాకు ఇస్తే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేసి చూపుతాను.. మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండే పరిస్థితి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి.. రాష్ట్రం కోసం రావాలని కోరాను.. ప్రజలన్నీ ఆలోచించుకుని.. మంచి చేసే వారిని ఎన్నుకోవాలి అని ఆయన తెలిపారు. ఇక, ఇవాళ ( మంగళవారం ) విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లోని గ్లాస్ డైలాగ్ పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు.. దర్శకుడు హరీశ్ శంకర్ బాధ భరించలేకనే బలవంతంగా ఈ డైలాగ్ చెప్పాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.