CM YS Jagan: మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతోంది. సంజీవపురం రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు చేరుకుంటారు.
Read Also: Chandrababu: మా పొత్తుతో జగన్‌కు నిద్రపట్టడం లేదు..
ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 2న మదనపల్లెలో మేమంతా సిద్దం సభ నిర్వహించనున్నట్లు మంత్రిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మదనపల్లిలో పర్యటించిన ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైందన్నారు. నంద్యాల, ఎమ్మిగనూరులో మేమంతా సిద్దం సభలు విజయవంతం అయ్యాయన్నారు. ఏప్రిల్ 2న మదనపల్లెలో 3, 4 తేదీల్లో పూతలపట్టు, నాయుడుపేట మేమంతా సిద్దం సభలు జరుగుతాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బస్సు యాత్ర షెడ్యూల్ ఆలస్యమవుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు ఈ సభలు ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మంచి ఉత్సాహం లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.