నేడు పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లరాదని పోలీసుల ఆంక్షలు విధించారు. విశాఖపట్నంలో వారాహి విజయోత్సవ టూర్ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన విడుదల చేయనుంది.
Read Also: Karnataka : కన్నతల్లిని కూడా వదలని నీచుడు.. ఛీ.. ఛీ..
అయితే, విశాఖపట్నంలో వారాహి మూడో దశ యాత్రను నిన్న(గురువారం) పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నగరంలోని జగదాంబ సెంటర్ లో కిక్కిరిసిన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాను వైజాగ్ లో ఒకప్పుడు సినీ నటుడిగా ఎలా షూటింగ్స్ చేశానో, ఇప్పుడు ఎందుకు జనం మధ్య నిలబడి మాట్లాడుతున్నానో అనే దాన్ని ఆయన వివరించారు.
Read Also: Mahalakshmi Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ సంపదలు సొంతమవుతాయి
సీఎం కావాలని తాను అనుకుంటే సరిపోద.. మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యా్ణ్ అన్నారు. తాను ఒక్క మాట మాట్లాడితే వైసీపీ నేతలు గయ్యిన లేస్తున్నారు.. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న నాకు ఇంకేంత ధైర్యం ఉండాలని జనసేనాని ప్రశ్నించారు. వైసీపీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకూ.. నేను ఉరుకోను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.