ఈరోజుల్లో యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. ఏది తప్పు అని కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. మత్తులో వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలను తీసుకువస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు మాత్రం అస్సలు తగ్గటం లేదు.. తాజాగా.. ఓ దుర్మార్గుడు తల్లి అని చూడకుండా దారుణంగా ప్రవర్తించారు..
కనీసం కనికరం లేకుండా కన్నతల్లిపై అత్యాచారం చేశాడు ఈ ఘటన బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ‘హరిదేవ్‌పూర్‌కు చెందిన 65 ఏళ్ల మహళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకుకు వివాహం అయ్యింది. అతడు తన భార్యతో కలిసి వేరు కాపురం పెట్టడంతో ఆమె చిన్న కుమారుడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన 33 ఏళ్ల చిన్న కుమారుడు నాలుగేళ్ల క్రితం తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడు.. ఆ విషయాన్ని ఎవ్వరికి చెప్పలేక కుమిలిపోయింది..
కొడుకు చేసిన పనికి కుమిలిపోతూ.. ఎవరి చెప్పుకోవాలో అర్థంకాక, నలుగురికి తెలిస్తే పరువు పోతుందని సమాజానికి భయపడి మౌనంగా ఉండిపోయింది. ఇటీవల ఆ రాక్షసుడు మరోసారి ఆమెపై హింసాత్మకంగా దాడి చేయడంతో భరించలేని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి.. జైలులో ఉంచారు. అనంతరం బాధితురాలికి మెడికల్ టెస్టులు చేయించారు. అలాగే తన పెద్ద కుమారుడు, ఆ మహిళ ఇంటికింద నివసిస్తున్న ఇద్దరు అద్దె దారులు సాక్షం చెప్పడంతో నిందితుడికీ జీవితఖైదు జైలుశిక్ష విధించి, భారీ జరిమానా విధించారు.. అంతేకాదు భారీ జరిమానా కూడా విధించారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..