Site icon NTV Telugu

Pawan Kalyan: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై స్పందించిన పవన్ కళ్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్‌ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు అభినందనలు తెలిపారు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్ చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచిందని.. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందించారు.

READ MORE: Bhagavanth Kesari: ఈ గౌరవం వారికే.. జాతీయ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ!

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయిత గా కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీచ్ చేశారు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. జాతీయ ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ MORE: AIIMS Study: పడక సుఖం కోసం మందులు వాడుతున్న యువత.. సంచలన రిపోర్ట్..!

Exit mobile version