జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలిసారిగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యావహరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషన్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మూవీ టీం. దీనికి సుకుమార్,…