ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. పలు విభాగాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటగా, వాటిలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అవార్డు రావడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వివరించారు. “భయపడుతూ ఉండే ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారే కథను ఎంతో అద్భుతంగా, సమర్థవంతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చాలా…
భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అవార్డు విజేతలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ చిత్రం: –12వ ఫెయిల్…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
Gaddar Awards 2024: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి వివిధ అవార్డులు సినీ రంగానికి చెందిన వారికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నంది అవార్డులు’ ప్రకటించేది. అయితే ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం అవి నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు…