జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన చిత్ర బృందానికి, బాలకృష్ణకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపాడు.