అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు తాను భావోద్వేగానికి గురయ్యానని.. ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చాయని అన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని తెలిపారు. అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని తెలిపారు. ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
Read Also: Aata Sandeep: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన సందీప్..
ఇదిలా ఉంటే.. సాధారణంగా తాము రాముడు, బాలాజీ కోసం తిరుమలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక పై రాముడి కోసం అయోధ్యకు వస్తారని తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి అయోధ్యకు ఎక్కువ మంది వస్తారని పేర్కొన్నారు. తనకు అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉన్నదని, రానున్న రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Ram Darshan: భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం..
అయోధ్య రామమందిర తీర్థ ట్రస్ట్ దేశంలోని పలువురు ప్రముఖులకు ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానం పంపించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్.. నిన్ననే అయోధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. రామమందిరం ఎదుట జనసేనాని ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.