ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజ్ ఫేమస్ అయ్యారు. అమెరికా వర్జీనియాలో జరిగే మూడు రోజుల సదస్సు కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 01 వరకు 12వ AKKA వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ (WKC 2024)కి యోగిరాజ్‌కి ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అమెరికా వీసా నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శిల్ప కళా రంగంలో యోగి…
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ రామ నవమి సందర్భంగా కొంత కాలంగా నిలిపి వేసిన వీవీఐపీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి…
అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలు మాత్రమే.. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు.
బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ…
దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు.