అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఎక్కడ చూసిన రామ జపంతో దద్దరిల్లుతుంది.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఈ రామునిపై భక్తిని చాటుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆట సందీప్ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాజాగా డ్యాన్స్ మాస్టరు సందీప్ అయోధ్య రాముని ప్రతిష్ఠ వేళ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. అందరిని ఆకట్టుకొనేలా అద్భుతమైన డ్యాన్స్ చేశారు.. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇంకొందరు మాత్రం ఆ అయోధ్య రాముడిని మీ డ్యాన్స్ తో కళ్ళకు కట్టినట్లు చూపించారని కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. మీరు ఒక్కసారి చూసేయ్యండి…