మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మినీ కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాంనివాస్ రావత్‌కు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…
జనసేన అధినేత,సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్‌లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు…