బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ముగ్గురు మంత్రులను తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో చోటు కల్పించారు.
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్.. ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ…
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్‌లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు…
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ ఇవాళ సాయంత్రం కొలువుదీరనుంది.. కేబినెట్ విస్తరణలో 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. వీరిలో కేబినెట్ మంత్రులుగా ప్రమోట్ అయిన ఏడుగురు సహాయ మంత్రులు కూడా ఉన్నారు.. ఇదే సమయంలో ఐదుగురు కేంద్ర మంత్రులను తొలగిస్తున్నారు ప్రధాని మోడీ… ఈ విస్తరణ తర్వాత కేబినెట్‌లో 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ వర్గానికి చెందిన మంత్రులు ఉండనుండగా.. 27 మంది ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగులు) మంత్రులు…