ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..