ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. అమెజాన్ లో పోకో బ్రాండ్ కు చెందిన POCO X6 Neo 5Gపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే వచ్చేస్తోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, సూపర్ AMOLED డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఇది స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
Also Read: Maruti Cars: మారుతి వ్యాగన్ ఆర్ కొనాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు ఆగాల్సిందే..!
అమెజాన్ లో POCO X6 Neo 5G పై 40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 19,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరో రూ. 1000 తగ్గింపుతో దక్కించుకోవచ్చు. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read: First GBS Death In AP: ఏపీలో తొలి జీబీఎస్ మరణం.. ఏపీ సర్కార్ అలర్ట్
పోకో ఎక్స్ 6 నియో 5జి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. పోకో ఈ ఫోన్ ను, మీడియాటెక్ Dimensity 6080 5G ప్రోసెసర్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ 8GB RAM, 128GB Storageతో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా అందించారు. 16MP సెల్ఫీ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ పోకో MIUI 14 సాఫ్ట్ వేర్ తో Android 13 OS తో పనిచేస్తుంది. ఈ పోకో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది.