న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. తొక్కిసలాట, రద్దీ వీడియోలను భద్రపరచాలని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులను కమిటీ ఆదేశించింది.
Read Also: Kesineni Nani: పదవిలో ఉన్న లేకపోయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటా
ప్రయాగ్రాజ్‌కి వెళ్లే రెండు ట్రైన్ల అనౌన్స్మెంట్ ఏకకాలంలో జరగడం వల్ల ప్రయాణికులు గందరగోళానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రెండు రైళ్ళ పేర్లు “ప్రయాగ్ రాజ్” అని ఒకే రకంగా ఉండడమే ప్రమాదానికి, తొక్కిసలాటకు కారణమని పేర్కొన్నారు. రైల్వే ద్విసభ్య కమిటీ ప్రాధమిక నివేదికలో కూడా దాదపు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “ప్రయాగ్ రాజ్” అనే పేరు రెండు రైళ్లకు ఉండడమే ప్రమాదానికి అసలైన కారణమని తేల్చి చెప్పారు. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్‌కు ప్రయాణికులు వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగిందన్నారు. “ప్రయాగ్ రాజ్ స్పెషల్” ఒక రైలు పేరు, రెండవ రైలు పేరు “ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రైస్” అని ఉందని అన్నారు. 16వ నెంబర్ రైల్వే ప్లాట్ ఫామ్ కు “ప్రయాగ్ రాజ్ స్పెషల్” రైలు వస్తోందని వచ్చిన ప్రకటనే మొత్తం గందరగోళానికి దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. “ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రైస్” అప్పటికే 14 వ నెంబర్ రైల్వే ప్లాట్ పై ఉంది.. “ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్” రైలు కోసం ఇంకా 14వ నెంబర్ రైల్వే ప్లాట్ ఫామ్ కు ప్రయాణికులు రాలేకపోయారు. రైల్వే ప్రకటన విని 16వ నెంబర్ ప్లాట్ ఫామ్ కు రైలు వస్తోందని పొరపడ్డారని పోలీసులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు, పిల్లలు, భారీ లగేజీ బ్సాగ్ లతో రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అదనంగా “ప్రయాగ్ రాజ్” వెళ్ళే మరో నాలుగు రైళ్లల్లో మూడు రైళ్లు ఆలస్యమయ్యాయన్నారు. “ప్రయాగ్ రాజ్” వెళ్లే ఈ రైళ్ళన్నీ ఆలస్యం కావడంతో.. 12 నుంచి 16వ ప్లాట్ ఫామ్‌ల్లో ప్రయాణికులు సంఖ్య అంతకంతకూ బాగా పెరిగి పోయిందని తెలిపారు. 14వ నుంచి 15వ ప్లాట్ ఫామ్ మధ్య “ఫుట్ ఓవర్ బ్రిడ్డి” (వంతెన) పై వెళ్తున్న ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు పడిపోవడంతో, వెనకున్న ప్రయాణికులు వరుసగా ఒకరిపై ఒకరు పడిపోవడంతో.. తొక్కిసలాట జరిగి ఊపిరాడక 18 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో గాయాల పాలయ్యారని పోలీసులు వెల్లడించారు.
Read Also: POCO X6 Neo 5G: క్రేజీ ఆఫర్.. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే
దాదాపు ఢిల్లీ పోలీసులు, రైల్వే శాఖ ఒకే అభిప్రాయంతో ఉంది. 16వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై “ప్రయాగ్ రాజ్ స్పెషల్” రైలు వస్తుందన్న ప్రకటనే కారణం అని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్‌కు “ప్రయాగ్ రాజ్ స్పెషల్” రైలు వస్తుందన్న ప్రకటన కారణమని రైల్వే శాఖ అంటోంది. కాగా.. సీసీటీవీలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. కాగా.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. మరికొంత మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళు నడుపుతుంది. ప్రజలకు ప్రయాణికులకు సపోర్ట్ చేయడమే తమ విధి అని రైల్వే డీసీపీ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. మృతి చెందిన వాళ్లకు కేంద్రం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు.. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు రెండున్నర లక్షలు.. స్వల్ప గాయాలైన వాళ్లకు లక్ష రూపాయలు ప్రకటించింది కేంద్రం.