Shocking : సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి మురుగు నాలాలో సుమారు నెలరోజుల వయస్సు గల శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంతోష్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని నాలా నుంచి బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ…
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు,…
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్త పద్ధతిలో పూజలు చేసి, ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..! సమాచారం…
CM Revanth Reddy: పండగరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడిన సంఘటనగా ఓ ఉదంతం రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం వాసి హేమంత్ (22) అనే యువకుడు గత నెల 29న షిరిడి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు హేమంత్‌ను అడ్మిట్ చేసుకోలేదు. ఈ…
Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.
Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
Osmania Hospital: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు.
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్‌లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు.…