Minuteman 3 Missile: అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్‌మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష అని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ క్షిపణి మార్షల్ దీవులకు సమీపంలోని రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడినట్లు సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం. READ ALSO: Tatiparthi…
Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని అన్నారు.
Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్,…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు.
PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ పర్యటనలో రక్షణ మంత్రి భారత సాయుధ దళాల సిద్ధతను సమీక్షించారు. పాక్ సరిహద్దుల్లో పడిన షెల్స్‌ను పరిశీలించారు. అనంతరం శ్రీనగర్ లోని ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. Read Also: Royal…
గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే…
ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
భారత్, పాకిస్థాన్‌లు రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు.
సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు.