లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఏ కూటమికి మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కింగ్ మేకర్లుగా టీడీపీ, జేడీయూ పార్టీలు నిలిచాయి. దీంతో మోడీ అధ్యక్షతన బీజేపీ సర్కార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఇక, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించాలని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ కోరారు. ఇవాళ (గురువారం) ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు సంఖ్యా బలం ఉంది.. కానీ బిహార్‌కు ప్రత్యేక హోదా తీసుకొచ్చే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. నిజంగా ‘నితీశ్ కుమార్ కింగ్‌మేకర్ అయితే ఇదే మంచి ఛాన్స్.. బీహార్‌కు ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలి అంటూ తేజస్వీ డిమాండ్ చేశారు.
Read Also: Kanchana 4: ‘కాంచన 4’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. సమ్మర్ టార్గెట్!
ఇక, దేశం మొత్తంలో కుల గణన నిర్వహించేలా నితీశ్ కుమార్ చొరవ చూపాలి అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం బీహార్‌కు మద్దతుగా ఉంటుందని ఆశిస్తున్నాను.. మోడీ మాయాజాలం ముగిసింది.. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే, ఇండియా కూటముల సమావేశాలనికి నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో వెళ్లడం సంచలనంగా మారింది. అయితే, దీనిపై స్పందించిన తేజస్వీ యాదవ్.. నితీశ్ వెనుక నాకు సీటు కేటాయించడంతో ఇద్దరం ఒకరినొకరం పలకరించుకకున్నామని అతడు క్లారిటి ఇచ్చారు.