CM YS Jagan: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్.. “రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.” అని సీఎం జగన్ శ్రీరామనవమి విషెస్ తెలిపారు.
Read Also: Sri Ramanavami LIVE Updates: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు.. లైవ్ అప్‌డేట్స్
రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2024