March 1st: ఈ రోజు ఫిబ్రవరి ఆఖరి రోజు. రేపటి నుండి అంటే మార్చి 1 నుండి కొన్ని నియమాలు మారుతున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఫిబ్రవరిలో ప్రభుత్వం అనేక నిబంధనలను మార్చింది. మార్చి నెల నుంచి అవి అమల్లోకి రానున్నాయి. గృహ సిలిండర్లు, బ్యాంకు రుణాలు, రైలు సమయాలు వంటి అనేక నియమాలు ఇందులో ఉన్నాయి. ఇందులో LPG ధర నుండి బ్యాంక్ లాకర్ నియమాలు ఉన్నాయి. మార్చిలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం.
రైల్వే టైమ్‌టేబుల్
వేసవి కాలం రాబోతుంది. అటువంటి పరిస్థితిలో, రైల్వేలు అత్యధిక వేడి కారణంగా అనేక రైళ్ల షెడ్యూల్‌ను మార్చవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మార్చిలో కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
బ్యాంకు రుణాలు
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును పెంచింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ రేట్లను పెంచాయి. ఇది నేరుగా లోన్, EMIలను ప్రభావితం చేస్తుంది. రుణాలపై వడ్డీ రేట్లు పెరగవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులు నిర్ణయించిన కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Read Also: Air India: మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఈ సారి ఫుడ్లో పురుగులట
సోషల్ మీడియా నియమాలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం మూడు ఫిర్యాదుల.. అప్పీల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 1 నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లకు ఈ నిబంధన వర్తిస్తుంది. అలాంటి సందర్భాలలో సోషల్ మీడియా సంబంధిత ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తారు.
LPG, CNG, PNG ధర
LPG, PNG , CNG సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయించబడతాయి. చివరిసారిగా ఫిబ్రవరి 1న డొమెస్టిక్ సిలిండర్ల మొత్తాన్ని కంపెనీలు పెంచలేదు. పండుగ కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, మార్చి 1 నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలలో మార్పు ఉండవచ్చు.
Read Also:Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు
12 రోజులు పనిచేయని బ్యాంకులు
మార్చి నెలలో హోలీ, నవరాత్రి వంటి అనేక పండుగలు సందర్భంగా, RBIక్యాలెండర్ ప్రకారం, మార్చిలో 31 రోజుల్లో 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.