Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహవీర్ జైన్ అనే ప్రయాణికుడు ముంబై నుంచి చెన్నై వరకు ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడు.
Read Also: Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు
ఈ సమయంలో అతడికి అందించిన ఆహారంలో పురుగు వచ్చింది. ఈ విషయాన్ని మహవీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎయిర్ ఇండియా సంస్థపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మహవీర్.. ఎయిర్ ఇండియా సంస్థ పరిశుభ్రత చర్యలు తీసుకున్నట్లు నాకు కనిపించడం లేదు. బిజినెస్ క్లాస్‌లో వడ్డించే భోజనంలో పురుగు వచ్చింది. అంటూ రాసుకొచ్చాడు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఘనటకు గానూ ప్రయాణికుడిని క్షమాపణలు కోరింది. దీనిపై సరైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
@airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89
— Mahavir jain (@mbj114) February 27, 2023