విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ చుట్టుపక్కల శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. రాచకొండలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచింది ప్రభుత్వం. కొత్తగా మహేశ్వరం డీసీపీ జోన్ గా ఏర్పాటు చేసింది. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా ఏసీపీ ఏర్పాటు, ఇబ్రహీం పట్నం ఏసీపీ కూడా మహేశ్వరం డీసీపీ కిందకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
రాచకొండలో కొత్తగా….
1. చర్ల పల్లి పోలీస్ స్టేషన్
2. నాగోల్ పోలీస్ స్టేషన్
3. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్
4. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్
5. మల్కాజ్ గిరి జోన్ లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
కొత్తగా ట్రాఫిక్ విభాగంలో కొత్త జోన్లు, పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు.
Read Also: Harish Rao: విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం
ట్రాఫిక్ విభాగంలో…
ఘట్ కేసర్
జవహర్ నగర్
మహేశ్వరం
ఇబ్రహీం పట్నం ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లు
మహేశ్వరం ట్రాఫిక్ జోన్ , ఏసీపీగా ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ విభాగంలో
ఎల్బీ నగర్
మహేశ్వరం జోన్
మల్కాజ్ గిరి జోన్
జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఏర్పాటు చేశారు.
ప్రతి జోన్ కి అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ అధికారి నియామకం చేశారు. యాదాద్రి టెంపుల్ కి ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. SOT కి కొత్తగా మహేశ్వరం జోన్ డీసీపీ గా ఏర్పాటు చేశారు. స్పెషల్ బ్రాంచ్ కు కొత్తగా ఒక డీసీపీ ఏర్పాటుచేశారు.
Read Also: China: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కోవిడ్.. లీకైన డాక్యుమెంట్‌లో వెల్లడి