విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రభుత్వం. దేశంలో అతి ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు అన్నారు హరీష్ రావు. మొదటి సారి 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వగా, 11వ వేతన సవరణ ద్వారా 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాం అన్నారు.
Read also: Cm Jagan Live At Pulivendula: పులివెందులలో సీఎం జగన్ బహిరంగ సభ
మన పక్కన ఉన్న ఏపిలో కంటే ఇది ఎక్కువ. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటివరకు మా ప్రభుత్వమే పరిష్కరించింది. ఇకపై కూడా పరిష్కరించేది మా ప్రభుత్వమే. కరోనా పరిస్థితులు, కేంద్రం సహాయ నిరాకరణ వంటి కారణాల వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది కలిగింది. ఒకటో తారీఖు జీతం రావడం లేదంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని ఆరోపించారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. 17వేల కోట్లకు కోత పెట్టింది. ఏకపక్షంగా 40వేల కోట్లకు కేంద్రం కోత పెట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందన్నారు.
Read Also: Vitamin B12 : విటమిన్ బి12 లోపిస్తే ఇన్ని సమస్యలా..?