Muddaraboina Venkateswara Rao: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించిన తరునంలో.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. తన కార్యాలయంలో ఉన్న టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.. అయితే, తాను వైసీపీలో చేరలేదు.. త్వరలోనే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
Read Also: Balakrishna: సినిమాలకు బాలయ్య బ్రేక్.. ఎన్నికల కదనరంగం కోసం కొత్త కార్లు సిద్ధం!
టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన ఆయన.. పార్ధసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.. కానీ, పార్టీ నూజివీడు ఇంఛార్జ్‌గా ప్రకటించారు అంటూ మండిపడ్డారు.. ఉరిశిక్ష వేసే ముందు.. కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరిన అడుగుతారు.. కానీ, నన్ను పార్టీ అడగలేదు అనే వాపోయారు. త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానన్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నేనేమైనా చెప్పానా? అని ప్రశ్నించారు. సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించాను.. ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు కదా? అని నిలదీశారు. ఇక, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అంశంతో సహా అన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తాను అని తెలిపారు. కానీ, పదేళ్లు నన్ను వాడుకుని బయటకు గెంటేశారు అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.
Read Also: Konakalla Narayana: వైసీపీ వైపు టీడీపీ మాజీ ఎంపీ చూపు..!? క్లారిటీ ఇచ్చిన నేత
కాగా, వైసీపీలో సీటు దక్కదన్న సంకేతాలతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు.. ఆయనను నూజివీడు నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా పార్టీ సర్వేలు కూడా చేసింది.. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన.. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.. పార్థసారథిని నూజివీడు ఇంఛార్జ్‌గా టీడీపీ ప్రకటిస్తే.. ఆ వెంటనే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు ముద్దరబోయిన.