ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించిన తరునంలో.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు..
నూజివీడు టీడీపీలో పార్థసారధి రచ్చ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నూజివీడు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి.. నూజివీడు సీటు తనకే అని సహకరించాలని ఫోన్ లో కోరారు పార్థసారధి. సారధి ఫోన్ కాల్స్ పై నూజివీడు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరక ముందే సారధి తమ వాళ్ళకు ఫోన్లు చేయటం సరికాదని సూచించారు. సీటు ఏమన్నా ఇస్తే పార్టీ ప్రకటన ఉంటుంది..…