Gutha Sukender Reddy: రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారాల్సిన అవసరం నాలాంటి వాళ్లకు లేదని స్పష్టత ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కానీ… నా కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామన్నారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ ఇలాగే జరుగుతోందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కేసీఆర్ విజయానికి అందరూ సహకరించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ మళ్లీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని సూచించారు. ఏ పార్టీలో ఉన్నా విజయం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు తనతో విడిపోవచ్చని, అయితే వారి విజయాన్ని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకు అభిమానులు, స్నేహితులు ఉన్నారని తెలిపారు. ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను, తన కొడుకు పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ మారేది లేదన్నారు. అవసరమైతే ఈ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పక్క పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష. తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ ఘన విజయం సాధించాలన్నారు.
Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు… తుమ్మల పాలేరు కు పోలేదు..