MP govt renames Bhopal’s Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్ ను పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ గా మార్చింది.
Read Also: AP Crime: బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..
తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఇలాంటి పేర్ల మార్పునే చేపట్టింది. తాజాగా రాజధాని భోపాల్ నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతాన్ని తక్షణమే జగదీష్‌పూర్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మధ్యప్రదేశ్ పరిపాలన అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చిన పేరు తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కేంద్రం హోంశాఖ మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. హోం మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 15న పేరుమార్పును జారీ చేసిందని పేర్కొంది. గతంలో ఫిబ్రవరి 2021లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హోసంగాబాద్ ని నర్మదాపురంగా, నస్రుల్లాగంజ్ ను భైరుండాగా పేర్లను మార్చింది.