Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ. 15 కంటే తక్కువ ఉంటుందని తెలుస్తోంది.
Moto G14 Launch:
మోటో జీ14 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా ప్రకటించింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు కూడా ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మోటో జీ14 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ గురించి ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీ ఇప్పటికే హింట్ ఇచ్చింది. డివైజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్ల వివరాలను వెల్లడించింది. మోటో జీ14 ఫోన్ బ్లూ, గ్రే కలర్ అందుబాటులో ఉంటుందట.
Also Read: Oppo K11 5G Launch: 5000mAh బ్యాటరీతో సూపర్ స్మార్ట్‌ఫోన్.. 26 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!
Moto G14 Camera:
మోటో జీ14 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల ఎల్‌సీడీ ఫుల్‌హెచ్‌డి+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది ముందు భాగం వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాసీ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ ఉన్న డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనికి ఎల్‌ఈడీ ఫ్లాష్ సపోర్ట్ ఉంటాయి. టాప్-సెంటర్ పొజిషన్‌లో ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు.
Moto G14 Price, Battery:
4GB RAM, 128GB UFS 2.2 స్టోరేజ్, ఆక్టా కోర్ Unisoc T616 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్-ది-బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్, IP52 రెసిస్టెన్నీ రేటింగ్ వంటి స్పెసిఫికేషన్లు మోటో జీ14 స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయి. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 34 గంటల టాక్ టైమ్, 16 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇండియాలో రూ. 10 నుంచి 15 వేల మధ్య ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
Also Read: Rat Death: ఇదేందయ్యో ఇది.. ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్! అసలు ట్విస్ట్ ఏంటంటే?