Oppo K11 5G Smartphone Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పొ’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. జూలై 25న ‘ఒప్పొ కే11 5జీ (Oppo K115G Smartphone) ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్‌లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఒప్పొ లేటెస్ట్ టీజర్ ప్రకారం.. ఒప్పొ కే11 ఫోన్ 5000mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కేవలం 26 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఫుల్ ఛార్జ్‌తో 18 గంటల వరకు వీడియో ప్లే అవుతుంది. 10 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
Oppo K11 5G Smartphone Battery and Price:
ఒప్పొ కే11 5జీ స్మార్ట్‌ఫోన్ 1600 ఛార్జింగ్ సైకిల్స్‌కు మద్దతు ఇస్తుంది. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్యాటరీ 80% సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 5G) యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ ఈ ఒప్పొ కే11 5జీ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు 2,000 యువాన్లుగా ఉండనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ. 22,743 ఉంటుంది.
Also Read: Rat Death: ఇదేందయ్యో ఇది.. ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్! అసలు ట్విస్ట్ ఏంటంటే?
Oppo K11 5G Smartphone Camera:
ఒప్పొ కే11 5జీ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 782 ప్రాసెసర్ ఉంటుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ నిల్వతో ఈ ఫోన్ రావొచ్చు. బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. 50 ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది. ఐఎంఎక్స్ 890 ప్రైమరీ కెమెరా సెన్సార్ అమర్చారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్‌లో ఉంటుంది.
Oppo K11 5G Smartphone Features:
ఒప్పొ కే11 5జీ ఫోన్‌లో 6.7 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. ఇది 2412 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది టీయూవీ రైన్‌ల్యాండ్ హార్డ్‌వేర్-స్థాయి బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరిన్ని అధునాతన ఫీచర్‌లతో ఒప్పొ కే11 5జీ వస్తుంది. చైనా మార్కెట్‌లో ఈ ఫోన్ ముందుగా అందుబాటులోకి వస్తుంది. తర్వాత భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.