Biryani Shop Owner Arrested After Crushes Rat Under His Bike In Noida: మనుషులను చంపితేనో లేదా దాడులు చేస్తోనో అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద జంతువులను చంపినా శిక్షార్హులవుతారు. అయితే ఇంట్లో, పంట చేన్లలో మనకు నష్టం కలిగించే ఎలుకను చంపినా కూడా శిక్ష పడుతుంది. ఇది నిజమే.. ఎలుకను చంపిన ఓ వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. మూగజీవి అని కనికరం లేకుండా ఎలుకను బైక్ కింద నలిపి చంపిన వ్యక్తిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మమురా గ్రామంలోని జైనుల్ అనే బిర్యానీ షాప్ ఓనర్ తన కొట్టు సమీపంలో తిరుగుతున్న ఓ ఎలుకను తన బైక్ ఎక్కించి చంపాడు. బైక్‌ను వెనకకు ముందుకు నడుపుతూ ఎలుకపై ఎక్కించి.. నలిపి నలిపి చంపేశాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది జస్టే వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జైనుల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూగజీవంపై ఇంత కర్కశత్వమా అంటూ కామెంట్స్ చేశారు.
ఎలుక మరణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా బిర్యానీ షాపుపై దాడి చేశారు. అంతేకాదు అందులో పని చేస్తున్న ఒక ఉద్యోగిపై దాడి చేశారు. వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిర్యానీ షాపు యజమాని జైనుల్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడని గుర్తించారు. పోలీసులు తనకోసమే వస్తున్నారని గ్రహించిన జైనుల్ పారిపోయాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు.
అసలు ఇక్కడే ట్విస్ట్ ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 కింద వేరే కేసులో జైనుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అతని అరెస్టుకు కారణం ఎలుక మరణం కాదని చెప్పారు. మమురాలోని గాలి నెం.5లో అప్నీ బిర్యానీ షాపులో మనీ విషయంలో కస్టమర్లతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ సమయంలో ఈ ఘటన వారి కంట పడిందట.
नोएडा में चूहे का मर्डर
बिरयानी वाले ने बाइक से कुचला
पुलिस ने किया गिरफ्तार
वीडियो सोशल मीडिया पर वायरल@noidapolice pic.twitter.com/U2W5RQ3KNE
— Privesh Pandey (@priveshpandey) July 24, 2023