కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై…
కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్.…