Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్…
Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.…
ములుగు జిల్లా వాజేడు మండలం చేరుకూరు మోతుకులగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహిళా రైతుతో పాటు నాలుగు పశువులు మృతి చెందాయి. వృద్ధ రైతు దంపతులు సొంత పంట పొలంలో చెట్లు, కమ్మలు తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు నరుకుతుండగా చెట్టుకొమ్మ విద్యుత్ తీగలపై పడింది. బరువు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. Also Read:Weight loss Injection: బరువు తగ్గించే ఇంజెక్షన్ ‘వేగోవి’ విడుదల.. ధర…
విజయవాడలో ఘోరం జరిగింది.. స్థానికంగా నారా చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు.. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటుంది.. అయితే, విద్యుత్ షాక్‌తో ఒక్కే కుటంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు.. వరుసగా ముగ్గురు మృతిచెందారు.. ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు..
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విద్యుత్ షాక్‌కు గురైన బాలుడిని ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరి రక్షించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం…
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అందరు చూస్తుండగానే కరెంట్ షాక్ తో గిలగిలా కొట్టుకుంటూ తుది శ్వాస విడిచారు.ఈ విషాద ఘటన కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలో చర్చ్ ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఎర్పాట్ల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుద్దంతురై ఏరియా ఉత్సవాల్లో నిచ్చెనను తీసుకెళ్తుండగా హైవోల్టేజీ వైర్లకు తగలడంతో యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. Also Read:CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం…
Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని కాలీ గార్డెన్స్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
Electric Shock: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 13 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం…