Mohan Bhagwat : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఆదివారం లోక్ మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఏకత అనేది శాశ్వతం.. భిన్నత్వం లో కూడా ఏకత్వం ఉందన్నారు. వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్ లోకి ప్రపంచాన్ని తీసుకురావాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై నైతికత పై చర్చ జరుగుతుందని, మనిషి బుద్ధి, హృదయం పై దాన్ని ఉపయోగించుకునే విధానం ఉంటుందన్నారు. మంచి బుద్ధి, హృదయాన్ని ఇచ్చేది భారతీయ సంస్కృతి అని, మనం ఎవరికి శత్రువులము కాదు… ఎవరు మనకు శత్రువులు కారన్నారు. సంతోషంను బయట వెతుక్కుంటూ ఉన్నారని, మన పూర్వీకులు సంతోషం మనలో ఉందని వందల సంవత్సరాల క్రితమే చెప్పారు! అని ఆయన అన్నారు. బుషుల ఆలోచనలో ఇది సనాతన దేశం, మన పూర్వీకుల దగ్గర సంస్కారం ఉండేది, కాబట్టి వ్యవహారం ఉండేది! అని ఆయన వ్యాఖ్యానించారు.
Duddilla Sridhar Babu : అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు
అంతేకాకుండా.. ‘సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరితో కొన్ని సంవత్సరాల క్రితం సంభాషణ జరిగింది! రూల్ ఆఫ్ లా ఎక్కడి నుండి వచ్చింది అని అడిగా. మన దేశంలో విదేశీయులు, ఆంగ్లేయుల ఆక్రమణకి వచ్చారు మన సంస్కృతిని చిన్నాభిన్నం చేశారు.. అయిన దేశం నిలబడిoది . భౌతిక జీవనం ఎలా సాగిoచాలో,మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఆధ్యాత్మిక బాటలో ఉంటే ధర్మం నిలబడుతుంది. సృష్టి నియమనుసారంగా మన పూర్వీకులు నడిచేవారు. ఇప్పుడు అది లేదు ధర్మం కంటే అధర్మం ఎక్కువ చేస్తున్నాం. స్వార్ధం ఎక్కువయిపోయింది, ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది?? విజ్ఞానం ముందు ధర్మం ఉండదా? విజ్ఞానం ఉపయోగించేవాడి తీరు బట్టి ధర్మం నిలుస్తుంది! ధర్మం గురించి మనం అందరం ఆలోచించాలి, దాని కోసం మన విజ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయాలి!’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
INDIA alliance: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే.. కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..