జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అమాయకురాలైన నా బంగారు తల్లి.. నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆరోపించారు.
తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు.
Mla muthireddy daughter: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి సొంత కూతురే.. పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్కడితో ఆగలేదు.. తండ్రీకూతుళ్లు పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో తోపులాట జరిగింది.