Kapu Ramachandra Reddy: నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు అని పేర్కొన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పరిస్థితుల్లో నేను వైసీపీలోకి వచ్చానో అందరికీ తెలుసన్న ఆయన.. 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనుకే ఉన్నాను. నా పరిస్థితే ఇలా ఉంది.. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు అని పేర్కొన్నారు కాపు రామచంద్రారెడ్డి.
Read Also: MRO Ramanaiah Incident: ఒక హత్య.. వంద ప్రశ్నలు.. ఎమ్మార్వో హత్య కేసులో విచారణ కథ ముగిసినట్టేనా..?
కాగా, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ఈ మధ్యే వైసీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆయన.. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కు ఓ దండం.. అంటూ కామెంట్స్ చేశారు.. వైఎస్ జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చానని.. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశామని.. కానీ, ఇప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. అయితే, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.. వైసీపీ నుంచి మేం వెళ్లిపోతున్నాం. మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు.. మా జీవితాలు సర్వ నాశనమయ్యాయి. ఈ రోజుకీ జగనే మా సర్వస్వం అని భావించాం.. వైఎస్ జగన్ ను మా దేవుడితో సమానంగా చూశాం.. ఇలా నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదు అంటూ కాపు రామచంద్రారెడ్డి హాట్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.