Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంగళవారం ఉదయం గ్రామ దేవత అయిన మూల పెద్దమ్మ దేవరలో గండా దీపం మోసిన అనంతరం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గండా దీపం మోసిన వెంటనే అలసట, అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న అనుచరులు, పార్టీ శ్రేణులు ఆమెను అత్యవసరంగా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Ravichandran Ashwin: మహిళా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన అశ్విన్.. వీడియో వైరల్..!
వైద్యులు ఆమెను తక్షణమే పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా ఇది ఒత్తిడి, వేడి కారణమైన అలసట కారణమై ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Vizag Metro Train: విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్..!