Ravichandran Ashwin: ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన తర్వాత టీనీపీఎల్ (టమిళనాడు ప్రీమియర్ లీగ్)లో మళ్లీ యాక్షన్‌లోకి వచ్చిన భారత మాజీ ఆల్‌రౌండర్ అశ్విన్ తాజాగా జరిగిన మ్యాచ్ లో వివాదానికి తెరలేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్, బ్యాట్ తో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. 38 ఏళ్ల ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం డిండిగుల్ డ్రాగన్స్ కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also: Vizag Metro Train: విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్..!
ఐడ్రీం తిరుప్పూర్ తమిళన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5వ ఓవర్ సమయంలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తిరుప్పూర్ కెప్టెన్ సాయి కిషోర్ బౌలింగ్ లో అశ్విన్ ఎల్బీడబ్ల్యూ కావడంతో మహిళా అంపైర్ అతన్ని ఔట్‌గా ప్రకటించింది. అయితే, అశ్విన్ మాత్రం బంతి లెగ్‌స్టంప్ వెలుపల పిచ్ అయిందని అభ్యంతరం తెలిపాడు. అయినప్పటికీ అంపైర్ తన నిర్ణయం నుంచి తగ్గకపోవడంతో అశ్విన్ 18 పరుగుల వద్ద పెవిలియన్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక అవుట్ అయినా తర్వాత డగౌట్‌కి వెళ్లే సమయంలో అశ్విన్ తన బ్యాట్‌ను తొడపై బలంగా కొట్టడంతో అతని నిరాశ, ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. ఈ చర్యపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తిరుప్పూర్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో డిండిగుల్ డ్రాగన్స్ జట్టు కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఎసక్కిముతు నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ తీసాడు. అతనితో పాటు మాథివన్నన్ 3 వికెట్లు, కెప్టెన్ సాయి కిషోర్ 2 వికెట్లు తీశారు. ఇక తక్కువ పరుగుల లక్ష్యాన్ని తిరుప్పూర్ జట్టు కేవలం 11.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని దక్కించుకుంది. తుషార్ రహేజా అజేయంగా 65 పరుగులు (39 బంతుల్లో) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో తిరుప్పూర్ జట్టు టోర్నీలో తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో వారు చెపాక్ సూపర్ గిల్లీస్ చేతిలో ఓడిపోయారు. మరోవైపు, డిండిగుల్ డ్రాగన్స్ తమ మొదటి మ్యాచ్‌లో లైకా కోవై కింగ్స్‌పై ఏడువికెట్ల తేడాతో గెలిచింది.
Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫
📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3
— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025