రెండు కుటుంబాలను ఆగం చేసిన వివాహేతర సంబంధం మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ…
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంగళవారం ఉదయం గ్రామ దేవత అయిన మూల పెద్దమ్మ దేవరలో గండా దీపం మోసిన అనంతరం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గండా దీపం మోసిన వెంటనే అలసట, అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న అనుచరులు, పార్టీ శ్రేణులు ఆమెను అత్యవసరంగా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి…
భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు..
మన దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేతృత్వంలో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ యుద్ధంలో అమరవీరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్‌కు అఖిల ప్రియ నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తిరంగా ర్యాలీ పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ తన…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్‌గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో సమీక్ష సమావేశానికి ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు బీసీ…
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది
మంచు మనోజ్ , మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లి దండ్రులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుకుంటున్నాయా..? అంటే అవును అన్నట్టుగానే ఉంది పరిస్థితి.. మొన్న నంద్యాలలో విజయ డైరీ చైర్మన్ తో వివాదం, నిన్న విజయ డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత హాట్ కామెంట్స్, మరో వైపు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది..