విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి సెంచరీ విరాట్ కు 50 సెంచరీ కావడంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సెంచరీని ఊహించని.. ఉత్తరప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు.
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్‌సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు.