ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
యశస్వి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన గంగూలీ చాలా ఇంప్రెస్ అయ్యాడు. యశస్వి తన ఇన్నింగ్స్‌తో గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి నిలిచాడు.