నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామం నుంచి మోతె వరకు 6.60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న డబుల్ లైన్ రోడ్డు పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ ( బుధవారం ) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రూ. 1000 కోట్లు లేదా రూ.2 వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి అప్పుడు రాష్ట్రానికి రావాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
Read Also: Bulldozer Action: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. నిందితుడి ఇల్లు కూల్చివేత
గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకకు ఎలాగైతే మెట్రో అభివృద్ది పనులకు డబ్బులు ఇచ్చావో అలాగే తెలంగాణ మెట్రో పనులకు డబ్బులు ఇవ్వాలి అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అడిగారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ కు వచ్చి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికి ఎమ్మెల్సీ కవితను జెల్లో వేస్తామని అనడానికి తెలంగాణ కు రావద్దు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Also: Ram Charan: ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న హీరోలు.. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు
ప్రధాన మంత్రిగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.. ప్రధాని అన్ని రాష్టలకు తండ్రిలాటివాడిగా ఉండాలి.. కానీ యూపీ, గుజరాత్ కి డబ్బులు ఎక్కువిచ్చి తెలంగాణకు మొండి చేయి చూపడానికి ఇక్కడకు రావద్దు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి సరైన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.